HomeTelugu Trendingగీతాంజలి మళ్లీ వచ్చిందిలో 'కిల్లర్‌ నాని' గా సునీల్‌

గీతాంజలి మళ్లీ వచ్చిందిలో ‘కిల్లర్‌ నాని’ గా సునీల్‌

sunil as killer nani in geeతెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘గీతాంజలి’. 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శ్రీనివాస్‌ రెడ్డి హీరోగాగా న‌టించిన ఈ సినిమాలో సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్ మాధవ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టించారు.

ఈ సూప‌ర్ హిట్ మూవీకి దాదాపు 10 ఏండ్ల త‌ర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమాకు శివతుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతాంజలి మళ్లీ వచ్చింది టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ అంజలి 50వ సినిమా. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుదలైన అంజ‌లి ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ మూవీలో టాలీవుడ్ హీరో క‌మ్ క‌మెడియ‌న్ సునీల్ ‘కిల్ల‌ర్ నాని’ అనే ఆసక్తికర పాత్రలో న‌టించ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దీనితో పాటు సునీల్ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సునీల్ ఒక హాంటెడ్ భ‌వ‌నం ముందు హాకీ స్టిక్‌తో నిల‌బ‌డి తీక్ష‌ణంగా చూస్తున్న‌ట్లు ఉంది.

ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండ‌గా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!