HomeTelugu Big Storiesస్టేజ్‌ పై కన్నీరు పెట్టుకున్న సూర్య .. వీడియో వైరల్‌

స్టేజ్‌ పై కన్నీరు పెట్టుకున్న సూర్య .. వీడియో వైరల్‌

8 5
తమిళ ప్రముఖ నటుడు సూర్య కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన చిన్నారుల కోసం అగరం ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఓ పుస్తకాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ నుంచి సహాయం పొందుతున్న గాయత్రి తన కష్టాల గురించి పంచుకున్నారు. సంస్థ ఆదుకోవడం వల్ల సాధించిన విజయాల్ని, తన ప్రయాణాన్ని వెల్లడించారు. తనది చిన్న పల్లెటూరని, తన తండ్రి రోజూ కూలి అని పేర్కొన్నారు. తన చదవుల కోసం ఫౌండేషన్‌ సహాయం తీసుకుని, కళాశాల విద్య పూర్తి చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ఇంగ్లిషు ట్రైనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తన విజయానికి కారణం ఫౌండేషన్‌ అని భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కథ విన్న సూర్య హృదయం కదిలింది. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. చిన్నపిల్లాడిలా కన్నీరుపెట్టుకుని పైకి లేచి.. గాయత్రి వద్ద వెళ్లారు. అమ్మాయిని ఆప్యాయంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. సూర్య మంచి మనసును అందరూ మెచ్చుకుంటున్నారు.

సూర్య ‘అగరం’ ఫౌండేషన్‌ను స్థాపించి పదేళ్లు అవుతోంది. తనను నటుడిగా స్వీకరించిన ప్రజలు, సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంస్థ కోసం విరాళాలు అందిస్తున్న శ్రేయోభిలాషులు, దాతలకు ధన్యవాదాలు చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!