నటి తాప్సికి తీవ్ర గాయలు

ప్రముఖ నటి తాప్సి చేతికి తీవ్ర గాయమైనట్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఆమె ఎడమ చేయి మొత్తం ఎర్రగా కందిపోయి ఉన్న ఫొటోను తాప్సి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె ‘గేమ్‌ ఓవర్‌’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఈ ఫోటోలు సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా విడుదల చేసినవా.. లేక నిజంగానే తాప్సీకి గాయమైందా అనే విషయం తెలియడం లేదు. అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌లో ‘దిల్‌ జంగ్లీ’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. అయితే ‘మంచు కొండల్లో షిఫాన్‌ చీరలు కట్టుకుని ఇరవై ఐదు రోజుల పాటు చిత్రీకరణ చేయడం చాలా కష్టం. అందుకే నేను వీటిని ఎంచుకున్నాను’ అని తాప్పీ పేర్కొనడం గమనార్హం.