HomeTelugu Trendingసంక్రాంతి బరినుంచి వెనక్కి తగ్గని హనుమాన్

సంక్రాంతి బరినుంచి వెనక్కి తగ్గని హనుమాన్

Hanuman latest update

తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు చాలా కాలంగా చెప్తున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అనుగుణంగా హనుమాన్ చిత్రాన్ని విడుదలకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.

సంక్రాంతి పండగకు గుంటూరు కారం, ఈగల్, సైంధవ్, నా సామిరంగా సినిమాలు పోటీలో ఉన్నాయి. చాలా సినిమాలు పోటీలో ఉండటంతో హనుమాన్ రిలీజ్ వాయిదా వేయాలని ఇద్దరు సీనియర్ నిర్మాతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా సెన్సార్‌ సర్టిఫికేషన్‌ను కూడా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ అవరోధాలను అధిగమించి సెన్సార్ సర్టిఫికెట్‌ను సాధించుకున్నారు.

ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం జనవరి 12నే హనుమాన్ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. జనవరి 12నే హనుమాన్ రిలీజ్ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. మరో భారీ అప్‍డేట్ తీసుకురానున్నట్టు వెల్లడించింది. డిసెంబర్ 27న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మహా మాస్ అప్‍డేట్ తీసుకురానున్నట్టు హనుమాన్ మేకర్స్ ప్రకటించారు.

అప్‍డేట్ టైమ్‍ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో నటించిన ఓ ముఖ్యమైన యాక్టర్ లుక్‍ను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎవరో ఊహించాలని కూడా ప్రశాంత్ ప్రశ్నించారు. హనుమాన్ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‍లోనూ రిలీజ్ చేయనున్నారు.

హిందీ సహా వివిధ భాషలకు సంబంధించి అగ్రిమెంట్లను కూడా మూవీ యూనిట్ చేసేసుకుంది. ఓటీటీ హక్కుల డీల్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అందుకే హనుమాన్ సినిమా రిలీజ్ వాయిదా కష్టమేనని అంటున్నారు.

హనుమాన్ మూవీ టీజర్, ట్రైలర్ అత్యున్నత ప్రమాణాలతో అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ పరంగా చిన్నదే అయినా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా యూనిట్ అంతా ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నారు. తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటించింది.

హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను ఇతర కీలకపాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!