బాలీవుడ్‌లో కమెడియన్ అలీకి చాన్స్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. దబాంగ్ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇండోర్ లో షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు కమెడియన్ అలీకి అవకాశం దక్కింది. దబాంగ్ 3 లో అలీ ఓ కీలక పాత్రను చేస్తున్నాడు.

టాలీవుడ్ లో దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఆలీ సాంబా రోల్ ను ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర బాగా పాపులర్ అయింది. ఆలీ నటనకు ఫిదా అయిన సల్మాన్ దబాంగ్ 3 సినిమాలో తీసుకున్నారట. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.