HomeTelugu Newsలాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

4 1
కరోనా మహమ్మాకి విజృభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను కొందరు ఉల్లంఘిస్తుండటంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు పంపారు. లాక్‌డౌన్‌ అమలును ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని పేర్కొంటూ సవివరమైన నిబంధనల జాబితాను కేంద్రం పంపింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu