‘సైరా’ అమితాబ్‌ మోషన్‌ టీజర్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా చరిత్రాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో బాలీవుడ్‌​ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే ఈ పాత్రకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. బిగ్‌ బీ అమితాబ్‌ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ మోషన్‌ టీజర్‌ని (ఫస్ట్‌లుక్‌) అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది. నరసింహారెడ్డి గురు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో ఉన్న ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ తారాగణంతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా ‘సైరా’ రూపొందుతోంది. కొణిదెల బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడు, హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.