దేవి శ్రీ ప్రసాద్‌తో ఎటువంటి సంబంధం లేదంటున్న హీరోయిన్

సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్లపై గాసిప్స్ రావడం కామన్. కానీ సంగీత దర్శకులపై రావడం అరుదు. అలాంటి అరుదైన గాసిప్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మీద వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న హీరయిన్ పూజిత పొన్నడతో దేవి శ్రీ ప్రేమలో ఉన్నాడనే వార్తలు గత కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పరిచయం వలెనే ఆమెకు సినిమా ఆఫర్లు వస్తున్నాయని కూడా అన్నారు. కానీ పూజిత మాత్రం అలాంటి ప్రేమ సంబంధాలు ఏవీ తనకు లేవని, దేవి శ్రీ తనకు జస్ట్ పరిచయస్థుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది.