HomeTelugu Trendingస్పోర్ట్స్‌ నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌!

స్పోర్ట్స్‌ నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌!

Vaishnav tej movie on sport

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ఉప్పెన. మొదటి సినిమా హిట్టు కావడంతో వైష్ణవ్‌కు వరుస సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయట. అదేవిధంగా వైష్ణవ్ కూడా ఇప్పుడే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే సెకండ్ మూవీ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో వైష్ణవ్ కొండపోలం మూవీ పూర్తి చేశాడు. వైష్ణవ్ చేయబోయే మూడో సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తన మూడో సినిమాను తమిళ ‘ఆదిత్యవర్మ’ ఫేమ్ గిరీషయ్య దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే సినిమా ప్రీప్రొడక్షన్ పనులతో సిద్ధం అవుతోందట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. త్వరలో షూటింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఇక మూడో సినిమా లైన్ లో ఉండగానే వైష్ణవ్ నాలుగో సినిమా అలా చర్చల్లో నిలిచింది. వైష్ణవ్ నాలుగో సినిమా కింగ్ నాగార్జున ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుంది. అన్నపూర్ణ బ్యానర్ లో చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాతో పృథ్వీ అనే కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హాకీ గేమ్ నేపథ్యంలో ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని వినికిడి. హాకీ ప్లేయర్ లుక్ కోసం వైష్ణవ్ శారీరకంగా సిద్ధం అవుతున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!