HomeTelugu Newsబిగ్‌బాస్‌ హోస్ట్‌గా.. విజయ్‌ దేవరకొండ!

బిగ్‌బాస్‌ హోస్ట్‌గా.. విజయ్‌ దేవరకొండ!

12 2

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజ‌న్- 4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ షోలో పాల్లోనే సభ్యుల నుంచి హోస్ట్‌ల గురించి రోజుకో కొత్త పేరుతో నిత్యం వార్త‌ వస్తునే ఉన్నాయి. సీజ‌న్-3 కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వంహ‌రించగా.. సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలిచాడు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన సీజ‌న్‌ల‌కి మించి ఈ సీజన్‌ వుండ‌బోతోంది. ఇందు కోసం బిగ్‌బాస్ టీమ్ ఇప్ప‌టికే భారీ ఏర్పాట్ల‌ని మొద‌లుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ షోలో నలుగురు హాట్‌ బ్యూటీస్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షోని గ్లామర్‌తో నింపేసిన నిర్వహకులు..ఈ సీజన్‌ను మ‌రింత సెన్సేష‌న్ గా మార్చేందుకు.. సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని బిగ్‌బాస్ 4కు హోస్ట్‌గా ఫైన‌ల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో టీమ్ వున్న‌ట్టు ప్ర‌చారం మొద‌లైంది.

ముందు ఈ సీజ‌న్ కోసం ఇప్పటికే ప‌లువురి పేర్లు తెర‌పైకొచ్చాయి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, నాగార్జున‌, స‌మంత హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ప్ర‌చారంలో ఉంది. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇందులో నిజం ఎంత అన్న‌ది తెలియాలంటే బిగ్‌బాస్ మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu