పిల్లలకు బంగారు ఉంగరాలు పంచిన హీరో అభిమానులు


తమిళనాడులో విజ‌య్.. ద‌ళ‌ప‌తి విజ‌య్.. ఈ పేరుకు ఎంతో క్రేజ్ ఉంది. ర‌జినీకాంత్ స్థాయిలో విజ‌య్‌కు అభిమానులు పెరిగిపోయారు. త‌న సినిమాల‌తో దుమ్ము దులిపేస్తున్న హీరో విజయ్ పుట్టిన రోజు జూన్ 22న. విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా అట్లీ తెర‌కెక్కిస్తున్న బిగిల్ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు.

ఇక అభిమానులు మాత్రం త‌మ హీరో పుట్టిన రోజును చాలా అద్భుతంగా జ‌రుపుకున్నారు. త‌మిళ‌నాడులో చాలా చోట్ల విజ‌య్ ఫ్యాన్స్ అసోషియేష‌న్స్ త‌మ హీరో పేరు మీద ఛారిటీ ప‌నులు చేశారు. పళ్లిపట్టు రాధానగర్‌ విజయ్‌ ప్రజా సంఘం ఆధ్వర్యంలో అక్క‌డి బస్టాండులో ఏర్పాటు చేసిన పేదలకు అన్నదానం చేశారు. మ‌రికొంద‌రు అభిమానులు
విజ‌య్ పేరు చెప్పి గుళ్లో అభిషేకాలు చేయించారు. మ‌రికొంద‌రు స్వీట్స్ పంచారు. ఆ త‌ర్వాత వేలూరు పెట్‌లాండ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 22న జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలను పంచారు. ఇప్ప‌టికీ విజ‌య్ కూడా త‌న పుట్టిన రోజు నాడు ఓ హాస్పిట‌ల్‌కు వెళ్లి అక్క‌డ ఆ రోజు పుట్టిన పిల్ల‌ల‌కు బంగారు ఉంగరాలు ఇవ్వ‌డం ఆన‌వాయితీ. అభిమానులు కూడా అదే ఫాలో అవుతున్నారు.