ప్రముఖ తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ ఈ వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు.
కెప్టెన్ విజయ్ కాంత్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. ఆయన చనిపోయారంటూ వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని త్వరలోనే పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు.
విజయకాంత్ ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా విజయ్‌కాంత్ ఊపిరితిత్తుల సమస్యలో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.













