రజనీకాంత్‌ సినిమాలో యువరాజ్‌ సింగ్‌ తండ్రి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ‘దర్బార్’ చిత్రంలో.. ప్రముఖ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ మేరకు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలో యోగ్‌రాజ్‌ ఓపెనింగ్‌ ఫైట్‌ సీన్‌లో నటిస్తున్నారని‌, రజనీతో తలపడే సన్నివేశాల్లో కనిపించనున్నారని సినీ వర్గాల సమాచారం. ఒకప్పటి క్రికెటర్‌ అయిన యోగ్‌రాజ్‌ సింగ్‌.. సినీ నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు వందకు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత రజనీ మళ్లీ ఖాకీ గెటప్‌లో కన్పించనున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates