HomeTelugu Newsతెలుగు రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయం

తెలుగు రాష్ట్రాల్లో 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయం

2 15తెలుగు రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమ ఆదాయాన్ని గుర్తించినట్లుగా ఆదాయపన్ను (ఐటి) శాఖ గుర్తించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సురభి అహ్లువాలియా ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 6 నుంచి హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం, ఢిల్లీ, పుణెతోపాటు 40కి పైగా ప్రాంతాల్లో ఐటి దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని 3 ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు చేశామని, ఆయా కంపెనీల్లో నకిలీ బిల్లులు గుర్తించామని తెలిపారు. ఏపిలోని ఓ ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇన్‌ఫ్రా కంపెనీలు బోగస్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్ట్‌ పనులను అప్పగించాయని, అకౌంట్‌ పుస్తకాలు, పన్నుల ఆడిట్‌ల నుంచి తప్పించుకునేందుకు రూ.2 కోట్ల లోపు ఆదాయం ఉన్న చిన్న సంస్థలను ఉపయోగించారని పేర్కొన్నారు. గుర్తించలేని విధంగా ఆ చిన్న సంస్థల చిరునామాలను సృష్టించారని తెలిపారు. అన్ని సంస్థల ఆదాయపు పన్నుల రిటర్న్‌లను ప్రధాన కార్పొరేట్‌ కార్యాలయం ఐపి అడ్రస్‌ నుంచే దాఖలు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. లెక్కలు చూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. 25 పైగా బ్యాంకు లాకర్లను జప్తు చేశామని పేర్కొన్నారు. బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులతో భారీగా నగదు చలామణి చేసినట్లు గుర్తించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu