రజనీకాంత్, కమల్ పొలిటికల్‌ ఎంట్రీపై కట్టప్ప సంచలన వ్యాఖ్యలు

తమిళ ప్రజలు సినిమా స్టార్లను రాజకీయాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తుంటారు. కొందరికైతే ముఖ్యమంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టారు. అందుకే స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమల్ పార్టీ పెట్టి ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా పాల్గొనగా రజనీ ఇంకా ప్రత్యక్ష రాజకీయం మొదలుపెట్టలేదు.

వీరి పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన నటుడు సత్యరాజ్ (కట్టప్ప) వారి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని, వారనుకుంటున్నట్టు తమిళ రాజకీయాల్లో శూన్యత లేదని, డీఎంకే లాంటి బలమైన పార్టీని పడగొట్టాలని అనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ఆయన మాటల పట్ల పలువురు అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.