హావీష్ కు జంటగా నందమూరి హీరోయిన్!

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అదితి ఆర్య. కల్యాణ్ రామ్ సరసన జంటగా నటించిన ఈ బ్యూటీ గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ భామ సంగతి అంతా మర్చిపోయారు. టాలీవుడ్ లో మరో ఛాన్స్ రావడానికి అదితికి చాలా సమయమే పట్టింది.

యంగ్ హీరో హావీష్ కథానాయికుడిగా దర్శకుడు శ్రీరామ్ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. రమేష్ వర్మ నిర్మిస్తోన్న ఈ
సినిమాలో హీరోయిన్ గా అదితి ఆర్యను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో సాగే ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.