మార్చి 10న చిత్రాంగద!

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘చిత్రాంగద’. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజు విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. స్క్రీన్‌ప్లే ప్రధాన హైలైట్‌గా వున్న ఈ చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా నాయిక జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తప్పకుండా చి్రతం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.