
Latest Telugu Movies on OTT:
టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద హిట్లు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. ఈ సినిమాలు థియేటర్లలోనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై కూడా సందడి చేయబోతున్నాయి. అల్లూ అర్జున్, వెంకటేశ్, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నాయి.
1. Pushpa 2: The Rule
ప్లాట్‌ఫార్మ్: నెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ: 2025 జనవరి 31 (టెంటేటివ్)
అల్లూ అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 గత చిత్రం ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్ గా వచ్చి రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన ఈ యాక్షన్ డ్రామా జనవరి చివరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
2. Sankrantiki Vastunnam:
ప్లాట్‌ఫార్మ్: జీ5
విడుదల తేదీ: 2025 ఫిబ్రవరి 14
వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామా రూ. 200 కోట్ల పైగా కలెక్షన్ సాధించిన ఈ సినిమా, ఎంటర్టైనింగ్ కంటెంట్‌కు మంచి రివ్యూలు సంపాదించింది. ఈ చిత్రం ఫిబ్రవరి మధ్యలో జీ5లో స్ట్రీమ్ కానుంది.
3. Game Changer:
ప్లాట్‌ఫార్మ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ: 2025 ఫిబ్రవరి 14
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఒక రాజకీయ థ్రిల్లర్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, అవినీతి, న్యాయం మధ్య పోరాటాన్ని చూపిస్తుంది. రామ్ చరణ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా కనిపించే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 14న స్ట్రీమ్ కానుంది.
4. Daaku Maharaaj:
ప్లాట్‌ఫార్మ్: నెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ: 2025 ఫిబ్రవరి 9
నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ కలిసి నటించిన డాకూ మహారాజ్ ఒక యాక్షన్ థ్రిల్లర్. ఒక మాజీ డాకూ అన్యాయంపై పోరాడే కథతో ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమ్ అవుతుంది.
ALSO READ: Tollywood IT Raids వెనుక బాలివుడ్ మాఫియా హస్తం ఉందా?