ఒక ఫైట్ కోసం 12 కోట్లు!

రజినీకాంత్ నటిస్తోన్న ‘రోబో 2’ సినిమాను మొదట 350 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలనుకున్నారు కానీ ఇప్పటి అంచనా ప్రకారం సినిమా బడ్జెట్ 500 కోట్లు అయింది. ఇంత భారీతనంతో రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది.

రజినీకాంత్, అక్షయ్ కుమార్ ల మధ్య కొన్ని కీలకమైన ఏరియల్ స్టంట్ ను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ను ఈ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నారు. సినిమాలో ఈ స్టంట్ ఓ హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. ఈ ఒక్క ఫైట్ కోసమే దాదాపు 12 కోట్లు ఖర్చు చేశారని చెబుతునారు. ఈ ఒక్క ఫైట్ కోసం అంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం మామూలు విషయం కాదు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 14న విడుదల చేసి దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.