HomeTelugu Big Storiesప్రభాస్‌ 'ఆదిపురుష్‌' షూటింగ్‌లో అగ్ని ప్రమాదం

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం

Fire breaks in prabhas Adiయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ ఈరోజు మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ముంబైలోని గోరెగాన్ స్టూడియోలో షూటింగ్ జరుపుతుండగా సెట్స్ లో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోవడంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిళ్ళందని తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ఈ రోజు షూట్ లో హీరో ప్రభాస్ మరియు విలన్ రోల్ లో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పాల్గొనలేదు. ‘ఆదిపురుష్’ ఆరంభించిన రోజే ఇలా జరగడం పట్ల అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!