‘ఘాజీ’ ఫస్ట్ డే కలెక్షన్స్!

రానా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఘాజీ’. జలాంతర్గామి యుద్ధం నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తొలి ఆట నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో రూపొందించిన ఈ సినిమా మూడు బాషల్లో కలిపి తొలిరోజున 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాకు కావల్సిన ఏ హంగులు ఈ సినిమాకు లేకపోయినా.. కొత్త దర్శకుడు సంకల్ప్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. కొత్త కాన్సెప్ట్, ప్రస్తుతం రానాకు ఉన్న క్రేజ్ ను బట్టి మొదటి రోజు సినిమా థియేటర్లు హౌస్ ఫుల్స్ గా మారాయి. ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడం, పైగా మరే సినిమా పోటీ లేకపోవడం వలన వీకెండ్స్ లో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.