HomeTelugu Trendingకస్టడీ: ఫస్ట్‌ సింగల్‌ విడుదల

కస్టడీ: ఫస్ట్‌ సింగల్‌ విడుదల

Head Up High Lyrical from C
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా కనిపిస్తోంది. ఈ మూవీలో నాగ్ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కెరియర్ లో మొదటి సారి నటిస్తున్నాడు. గత ఏడాది థాంక్యూ మూవీతో ఫ్లాప్‌ అందుకున్న నాగ చైతన్య కస్టడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు. హెడ్ అప్ హై అనే థీమ్ తో ఈ సాంగ్ కి రిలీజ్ చేశారు. పోలీస్ పవర్ ని రిప్రజెంట్ చేసే విధంగా సాగే ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి శ్రీ శివాని విపీ లెరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇక యువన్ శంకర్ రాజా ఈ సాంగ్ ని పాడటంతో పాటు మ్యూజిక్ కూడా అందించాడు.

పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ లో అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ పాడుకున్న పాటగా దీనిని దర్శకుడు వెంకట్ ప్రభు ఆవిష్కరించారు. ఇక సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా అంటూ సాగే ఈ సాంగ్ లో పోలీస్ జాబ్ గొప్పతనాన్ని ప్రెజెంట్ చేశారు.

అలాగే పోలీస్ ఆఫీసర్ సొసైటీలో ఎలాంటి బాద్యత కలిగి ఉంటాడనే విషయాన్ని పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి యువన్ శంకర్ రాజాతో పాటు ఇళయరాజా కూడా సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీని నిర్మించారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!