ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్!

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా బాలీవుడ్ టాప్ టెక్నీషియన్ మురళీధర్ ను ఎంపిక చేసుకున్నారు. తాజాగా ఈ సినిమా కోసం మరో హాలీవుడ్ టెక్నీషియన్ వాన్స్ హార్ట్వెల్ ను రంగంలోకి దింపుతున్నారు.

కృత్రిమ అవయవాల సృష్టికర్తగా మేకప్ మేన్ గా ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’,’లైఫ్ ఆఫ్ పై’,’ఐరన్ మాన్’,’రోబో’ ఇలా పలు చిత్రాలకు ఆయన పని చేశారు. బాబీ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గెటప్స్ కోసం ఈ హాలీవుడ్ టెక్నీషియన్ ను పిలిపించారని చెబుతున్నారు. మొత్తానికి సినిమా సెట్స్ పైకి వెళ్లకముందు నుండే అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నెల 13న సినిమాను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.