ప్రభాస్ ‘జాన్‌’ కోసం భారీ సెట్


బాహుబలి భారీ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ సాహో, జాన్ సినిమాలు వరుసగా చేస్తున్నారు. సాహో షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం జాన్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

1920 కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూరప్ లోని కొన్ని లొకేషన్స్ లో సినిమా కొన్ని రోజులు షూటింగ్ చేశారు. అయితే అప్పటి రోజులకు అనుగుణంగా షూటింగ్ జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారట. దాదాపు రూ.30 కోట్ల రూపాయల భారీ వ్యయంతో యూరప్ లాంటి సెట్ వేయనున్నట్టు సమాచారం. రూ. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.