HomeTelugu Trendingతల్లి కాబోతున్న ఇలియానా!

తల్లి కాబోతున్న ఇలియానా!

ileana dcruz announces pre

టాలీవుడ్‌లో దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. ఇటీవలే ఈ అమ్మడుకి టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయ్యాయ. అయితే సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ గోవా బ్యూటీ అభిమానులకు బిగ్‌షాక్‌ ఇచ్చింది.ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఇలియానానే ఈ విషయం వెల్లడించింది.

ఈ రోజు ఇలియానా చేసిన ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఇలియానా రెండు ఫొటోలను షేర్ చేసింది. ఒక ఫొటోలో ‘అడ్వెంచర్ మొదలైంది’ అనే క్యాప్షన్ తో ఉన్న టీషర్ట్ ఉండగా.. మరో ఫొటోలో తన మెడలో వేలాడుతున్న ఓ పెండెంట్ ను చూపించింది. ఆ పెండెంట్ పై మామా (అమ్మ) అనే ఇంగ్లిష్ అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోల కింద ‘కమింగ్ సూన్’ అంటూ క్యాప్షన్ జతచేసింది.

ileana dcruz1

మై లిటిల్ డార్లింగ్.. నిన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ఇలియానా తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో ఇలియానాకు అభినందనలు చెబుతూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిడ్డ తండ్రిని పరిచయం చేయాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు రూమర్లు వినిపించాయి. అయితే, 2019లో వాళ్లు విడిపోయారని ఆ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ తో ఇలియానా ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే, ఈ ప్రచారంపై ఇలియానా స్పందించలేదు. ప్రస్తుతం కూడా తను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కానీ తండ్రి ఎవరనేది కానీ, పెళ్లి విషయం కానీ చెప్పలేదు. కాగా, తల్లి కాబోతున్నానంటూ ఇలియానా చేసిన పోస్టుకు ఆమె తల్లి సమీరా కూడా కామెంట్ చేశారు. మనవడు/ మనవరాలికి స్వాగతం చెప్పే క్షణం కోసం ఎదురుచూస్తున్నానంటూ డ్యాన్సింగ్ ఎమోజీతో కామెంట్ చేశారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!