HomeTelugu Trendingబేబి బంప్‌తో ఇలియానా ఫొటోలు వైరల్‌

బేబి బంప్‌తో ఇలియానా ఫొటోలు వైరల్‌

Ileanas photos with baby b
టాలీవుడ్‌లో ‘దేవదాసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత పలు హిట్‌ మూవీస్‌ చేసింది. ఈ సినిమా తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకానొక దశలో వరుస పరాజయాలు పలకరించాయి. గోల్డెన్‌ లెగ్‌ అన్నవాళ్లే.. ఐరెన్‌ లెగ్ అంటూ ముద్ర వేశారు. దాంతో మకాం ముంబైకి షిఫ్ట్‌ చేసింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఒకటి, రెండు సినిమాలు తప్పితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి చేయలేదు. దాంతో గత కొంత కాలంగా ఇలియానా చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తుంది.

అయితే మూడు వారాల క్రితం ఇలియానా ప్రెగ్నెంట్‌ అయినట్లు ఫ్యాన్స్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. ‘త్వరలో నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నాను.. నా చిట్టి డార్లింగ్’ అంటూ రెండు ఫోటోలను షేర్‌ చేస్తూ ప్రెగ్నెంట్‌ న్యూస్‌ను అభిమానులతో పంచుకుంది. ఇంకా పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు తెలపడంతో నెటిజన్లు తండ్రి ఎవరో చెప్పమంటూ తెగ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఈ గోవా బ్యూటీ బేబి బంప్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. దానికి క్రికెటర్‌ కే.ఎల్‌ రాహుల్‌ భార్య, నటి అతియాశెట్టి లవ్‌ సింబల్‌ను జత చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌ కొనసాగింది. కాగా కొన్నాళ్ల డేటింగ్‌ తర్వాత అతడితో బ్రేకప్‌ చెప్పేసింది. ఆ తర్వాత కత్రినాకైఫ్‌ సోదరుడు స్టెబాస్టిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంట పడింది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? లేదా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!