‘జోహార్‌’ మూవీ ట్రైలర్‌


ఎస్తర్‌ అనిల్‌, ఈశ్వరీరావు, చైతన్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జోహార్‌’. తేజ మర్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీ బాట పట్టింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో దీన్ని రిలీజ్‌ చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజకీయ నేపథ్యంలో సాగే కథ ఇది. పొలిటికల్‌ సెటైర్‌లా దీన్ని తీర్చిదిద్దారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. ఉత్కంఠగా, ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

CLICK HERE!! For the aha Latest Updates