‘ఎన్టీఆర్‌’ తండ్రితో తనయుడు

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్‌టీఆర్‌’. ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు.

’30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్.. వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా’ అంటూ ప్రచారం రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు కల్యాణ్‌రామ్‌.