HomeTelugu Newsకరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

9 16
కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మీ కుటుంబంలోని, పరిసర ప్రాంతాల్లోని వారికి అది సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మాధ్యమాల ద్వారా ప్రచారాలు చేస్తున్నాయి. ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా కొందరు కరోనా లక్షణాలు ఉన్నా ఎక్కడ వారిని నిర్బంధంలో పెడతారోనని భయంతో వైద్యుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు. ఆస్పత్రులనుంచి కొందరు కరోనా బాధితులు పరారైన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా మహారాష్ట్రలో కనిపిస్తోంది.

ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా 40 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధిక బాధితులు ఉన్నది మహారాష్ట్రలోనే. అందుకే అక్కడి ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కరోనాను ఎదుర్కునేందుకు రూ. 45 కోట్లను తక్షణమే విడుదల చేసింది. ఈ నిధులను గృహ నిర్బంధంలో ఉన్నవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు ఖర్చు చేయనున్నారు. వారికి ఫుడ్, టీవీ, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా లక్షణాలు తమకు ఉన్నట్టు తెలిసినా కొందరు అశ్రద్ధ వహిస్తున్నారు. వారి ప్రాణాలతో పాటు ఇతరులనూ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అందుకోసం కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు కనిపిస్తే వారిని వెంటనే గుర్తుపట్టేలా ఏర్పాట్లు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ‘కరోనా నుంచి మిమ్మల్ని కాపాడుతున్నందుకు గర్వంగా ఉంది’ అనే సందేశంతో ఉన్న స్టాంప్‌ను క్వారంటైన్‌లో ఉండాల్సినవారి ఎడమ చేతిపై అధికారులు వేస్తున్నారు. వెంటనే చెరిగిపోకుండా ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరాతో ఈ స్టాంప్‌ను వేస్తున్నారు. ఇది కనీసం నెలరోజులపాటు ఉంటుంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu