మరోసారి ఆ హీరోయినే కావాలంటున్న మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆ హీరోయిన్‌కే ఓటు వేశాడట. త్వరలో కొరటాల శివతో చేయబోయే సినిమాలో కూడా ఆ హీరోయిన్‌నే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టాడు. అంతేకాదు త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ సినిమాను అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో చిరంజీవి.. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 152వ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నాడు. జూలై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లో ఒక సెట్‌ను కూడా రెడీ చేస్తున్నారు. అక్కడే ఫస్ట్ షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. చిరంజీవి.. ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాలో మరోసారి నయనతారనే హీరోయిన్‌గా తీసుకోవాలని చిరంజీవి ఫిక్స్ అయినట్టు సమాచారం. ముఖ్యంగా ‘సైరా..నరసింహారెడ్డి’ షూటింగ్ సమయంలో నయనతార ..ఒక సినిమాపై చూపే అంకితభావం చిరును ఇంప్రెస్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ సినిమాలో మరోసారి ఏరికోరి నయనతారను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నయనతారతో మరో హీరోయిన్‌కు కూడా ఛాన్స్ ఉంది. ఈ పాత్ర కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు జబర్ధస్త్ అనసూయ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి రామ్ చరణ్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.