‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో రాజమౌళి, కొరటాల సందడి

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు”. షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై తెగ సంద‌డి చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయారు. ఈ షో తొలివారం అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ మ్యాజిక్ కారణంగా మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. అప్పుడే షో మొదలై మూడు వారాలు గడిచిపోయింది. అయితే గత కొన్ని రోజుల “ఎవరు మీలో కోటీశ్వరుడు” షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోలో రాజమౌళి కన్పించాడు. ఆ పిక్స్ వైరల్ అవ్వడంతో రాజమౌళి ఈ షోకు అతిథిగా విచ్చేస్తారని అన్నారు. కానీ మూడు వారాలు గడిచిపోయినా ఆయన మాత్రం షోలో కన్పించలేదు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను కూడా నిర్వాహకులు వదిలారు.

ఆ ఎపిసోడ్ (సెప్టెంబ‌ర్ 20) సోమవారం ప్రారంభం అవుతుంది. ఇక రాజమౌళితో పాటు మరో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా హాట్ సీట్లో కూర్చోనున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఇద్దరు దర్శకులతోనూ ఎన్టీఆర్ సినిమాలు చేస్తున్నారు. రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’, కొరటాలతో ‘ఎన్టీఆర్ 30’. ఈ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates