నాగ‌శౌర్య సరసన కన్నడ బ్యూటీ!

నాగ‌శౌర్య హీరోగా, క‌న్న‌డ‌ లో ‘కిరిక్ పార్టి’ అనే చిత్రంలో త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ హీరోయిన్ గా తెలుగుకి ప‌రిచ‌యం చేస్తూ, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ లో ప‌నిచేసిన వెంకి కుడుముల ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే ఈ చిత్రం ఏప్రిల్ 10న ప‌లువురు రామానాయుడు స్టూడియోస్ లో ఘ‌నంగా పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మవుతుంది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికి ఉగాది శుభాకాంక్ష‌లు తెలుపుతు ఈ చిత్ర వివరాలు నిర్మాత‌లు తెలియ‌జేసారు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ..”ఏవిష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నాము. ఏప్రిల్ 10 న ప‌లువురు ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ పూజాకార్క‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. మ‌రిన్ని వివరాలు ఆరోజు తెలియ‌జేస్తాం” అని అన్నారు
ద‌ర్శ‌కుడు వెంకి కుడుముల మాట్లాడుతూ.. ”నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో నాగ‌శౌర్య గారికి , నిర్మాత‌లు ఉషా ముల్పూరి, శంక‌ర‌ప్ర‌సాద్ ముల్పూరి గారికి ధ‌న్య‌వాదాలు. నాగ‌శౌర్య కి జంట‌గా ర‌ష్మిక మండ‌న్న‌ న‌టిస్తుంది. హీరో నాగ‌శౌర్య లుక్ అండ్ క్యార‌క్ట‌రైజేష‌న్ కొత్త‌గా వుంటుంది. ప్రేక్ష‌కులు నాగ‌శౌర్య ని కొత్త‌గా చూస్తారు. ఫ్యామిలి అంతా వ‌చ్చి చ‌క్క‌గా న‌వ్వుకునే మంచి కామెడి ఈ చిత్రంలో వుంటుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 10 న రామానాయుడు స్టూడియోస్ లో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది” అన్నారు.