ఎన్టీఆర్‌30.. ముహూర్తం ఫిక్స్‌

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్30 అప్డేట్‌ వచ్చేసింది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఎన్టీఆర్ 30వ చిత్రానికి మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసింది కొరటాల అండ్ టీమ్. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతోపాటు ఓ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ కూడా విడుదల చేసింది.

సముద్రం నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుండగా, ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను క్వాలిటీ పరంగా ఆర్ఆర్ఆర్‌ను మించి ఉండేలా ప్రయత్నిస్తామని తారక్ ఇటీవల హాలీవుడ్ మీడియాతో వెల్లడించాడు.

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాతో తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. తమిళ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నాయి. కాగా, ఈ సినిమా ముహూర్తానికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్టాలెక్కలేదు.

దీంతో ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై తారక్ స్వయంగా ఓ ఈవెంట్‌లో ప్రస్తావించాడు కూడా. ఇప్పుడు ముహూర్తం ప్రకటించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Image

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates