ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులు మాత్రమే

ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులు మాత్రమేప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల తాను మంచి స్నేహితులమని నటుడు విష్ణు పేర్కొన్నారు. తాజాగా ‘రాక్షసన్‌’తో మంచి విజయాన్ని అందుకున్న విష్ణు.. ఇప్పుడు ‘జగజ్జాల కిలాడి’ చిత్రంలో నటిస్తున్నారు. విష్ణుకు 2011లో వివాహమైంది. అయితే భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో గత ఏడాది విడిపోయారు. ఇదిలా ఉండగా తాజాగా ఆయన బాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాలాతో సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విష్ణు స్పందిస్తూ ‘నాకు జ్వాల అంటే ఇష్టం. ఆమెకు కూడా నేనంటే ఇష్టం. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసు. కామన్‌ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటాం. ప్రస్తుతం మేమిద్దరం స్నేహితులు మాత్రమే. ఈ స్నేహం తదుపరి దశకు వెళ్తుందా..? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని’ పేర్కొన్నారు.