సూపర్ స్టార్ తో సినిమా చేస్తా!

దర్శకుడిగా వరుస విజయాలను అందుకుంటూ బాహుబలి సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తానని అంటున్నారు. రజినీకాంత్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఆశ పడుతుంటారు. అయితే రజినీకాంత్ స్వయంగా ఓ సంధర్భంలో రాజమౌళి పేరు ప్రస్తావించారు. ఈ ప్రశ్న రాజమౌళికి కోలివుడ్ మీడియా నుండి ఎదురవ్వగా..

రజినీకాంత్ లాంటి హీరోలతో సినిమా చేసే అదృష్టం కోసం సంవత్సరాలుగా ఎదురు చూసే దర్శకులు ఉన్నారు. అలాంటి అదృష్టం నాకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ తన భావాలను వ్యక్తపరిచారు. ఆయనతో సినిమా చేసే ఆలోచన ఎప్పటినుండో ఉందని, ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం కూడా ఉందని అన్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికైతే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాస్త సమయం పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.