మా అధ్యక్షుడు పై రాజశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు నెలల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికలు.. రాజకీయ పోరును తలపించాయి. శివాజీరాజా, నరేష్‌ టీమ్‌లు పైచేయి సాధించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. ఎన్నికలు ముగిసి.. నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాకు. ఉపాధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ పదవులు కూడా నరేష్‌ టీమ్‌కు చెందిన జీవిత, రాజశేఖర్‌లకే దక్కాయి. ఎన్నికల తర్వాత అంతా కలిసే పని చేస్తామని నరేష్‌.. ఆ సమయంలో చెప్పారు. ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నారు.

‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ కలిసి పనిచేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ అన్నారు. నరేష్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నిన్నతొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ అందరూ అన్ని అంశాలపై చర్చించుకున్నామన్నారు. శివాజీ రాజా, నరేష్‌లు కలిసి పని చేయడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. తొలి సమావేశం విజయవంతమైందని, అందరూ కలిసిపోయామని తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates