జయలలిత పాత్రలో సీనియర్ హీరోయిన్!

హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేస్ లో దూసుకుపోయిన రమ్యకృష్ణ.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోసారి తన సత్తా చాటుతోంది. బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ స్థాయి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు మరోసారి ఆమె రేంజ్ పెరిగే క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు టాక్.
ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించారు.

ఆమె ఎంతోమంది ప్రభావితం చేశారు. ఆమె మరణానంతరం ఆమె జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించడానికి కొంతమంది దర్శకులు రంగంలోకి దిగుతున్నారు. రీసెంట్ గా త్రిష, జయలలితకు తాను పెద్ద అభిమానిననీ.. ఆమె పాత్రలో నటించాలనుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఇకా తాజాగా రమ్యకృష్ణ కూడా తన డ్రీమ్ రోల్ జయలలిత అని చెప్పారు.

ఆమె బయోపిక్ ను ఎవరు సినిమాగా చేయడానికి సిద్ధపడినా.. జయలలిత పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని రమ్యకృష్ణ అన్నారు. తమిళంలో కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆయన రమ్యకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ కాంబినేషన్ ఖరారైనట్లే అని తెలుస్తోంది.