లీక్: ‘సాహో’ టీజర్!

నిన్నటికి నిన్న బాహుబలి2 సినిమాలో కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. తాజాగా ప్రభాస్ కొత్త సినిమా సాహో టీజర్ కూడా లీకైంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహో’ సినిమా టీజర్ ను బాహుబలి2 తో పాటు ఈ నెల 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ టీజర్ ముందుగానే ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

ఈ టీజర్ లో మొహామంతా రక్తం మరకలతో ఉన్న ప్రభాస్ ను చూసి ”వాడి రక్తం చూస్తేనే అర్ధమవుతుంది రా.. వాడిని చచ్చేలా కొట్టారని” అంటూ ప్రభాస్ ను ఉద్దేశించి విలన్ ఓ డైలాగ్ చెబుతాడు… ‘సార్ అది వాడి రక్తం కాదు.. మన వాళ్ళ రక్తం’ అని విలన్ గ్యాంగ్ లో మరొకరు డైలాగ్ చెబుతాడు. దానికి ప్రభాస్ ‘ఇట్స్ షో టైమ్’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. టీజర్ ను కూడా చాలా స్టైలిష్ గా కట్ చేశాడు సుజీత్. ప్రభాస్ కొత్త లుక్ కూడా బావుంది. బాహుబలి2 సెన్సార్ కార్యక్రమాలు చాలా చోట్ల జరిగాయి. ఏదొక ప్రాంతం నుండి ఈ టీజర్ లీక్ అయిందని తెలుస్తోంది.