చరణ్ సినిమా నుండి సమంత తప్పుకుందా..?

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకున్నారనే వార్త జోరుగా వినిపించింది. గతంలో కూడా ఆమె చరణ్ తో కలిసి నటించాల్సింది కానీ కుదరలేదు. ఈసారి వీరిద్దరు కలిసి నటించేది పక్కా అని అంతా అనుకున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లనుండి. ముందుగా అనుకున్న అనుపమ పరమేశ్వరన్ ను తప్పించి మరీ సమంతను ఎన్నుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి సమంత తప్పుకుందనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి సమంత, చైతు లు వచ్చే ఏడాది మధ్యలో తమ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ వివాహం కాస్త ముందుకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తన డేట్స్ కారణంగా సినిమా షెడ్యూల్స్ దెబ్బ తినే అవకాశం ఉందని దాని కారణంగా సినిమా నుండి తప్పుకోవడమే మంచిదని దర్శకనిర్మాతలతో సమంత చెప్పినట్లు టాక్. దీంతో మరో హీరోయిన్ ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది!