వైరల్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-4 హోస్ట్‌గా సమంత?

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షోకి ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. షోకి టీఆర్పీ కూడా అదే రెంజ్‌లో ఉంటాయి. దానికి కారణం అందరీకి తెలిసిన సెలబ్రిటీలు పాల్గొనడం ఒకటైతే, దానికి మరెంతో పేరున్న సినిమా స్టార్‌లు హోస్టుగా వ్యవహరించడం మరొకటి.

కాగా తెలుగు బిగ్‌బాస్ సీజన్-1కి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిగా.. సీజన్-2కి నాని, సీజన్-3కి అక్కినేని నాగార్జున హోస్టులుగా చేశారు. ఎవరికీ వారు తమ స్టయిల్ లో హోస్ట్ చేయడంతో షోకి మంచి ఫాలోయింగ్‌ వచ్చింది. ఇక ఇప్పుడు త్వరలో సీజన్-4 ప్రారంభం కానుంది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ ఎంపిక కూడా మొదలైపోయింది. ఈ విషయంలో కొందరి పేర్లు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ సీజన్‌కు హోస్ట్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ప్రస్తుతం హీరోయిన్‌ సమంతతో సంప్రదింపులు జరుగుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తనైతే షోకి గ్లామర్ రావడంతో పాటు, షోని సరదాగా, చలాకీగా నిర్వహిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారట. ఈ ఆఫర్‌ని ఆమె అంగీకరిస్తే.. బిగ్‌బాస్‌లో హోస్ట్ చేసే తొలి హీరోయిన్ అవుతోంది. ఈ ప్రోగ్రామ్ చేయడానికి సమంతకు భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట స్టార్ మా. కెరీయర్‌ పీక్స్‌లో ఉన్న ఈ టైమ్‌లో సమంత ‘బిగ్‌బాస్ సీజన్‌-4’కు హోస్ట్‌గా ఉండటానికి ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి.

CLICK HERE!! For the aha Latest Updates