రెమ్యునరేషన్ పెంచేసిన సమంత!

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటి సమంత. ఆమె తాజా చిత్రం ‘మజిలీ’ గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో ఆమె కోసమే ప్రత్యేకంగా కథలు తయారుచేస్తున్నారు దర్శకులు. డిమాండ్ బాగా పెరగడంతో సమంత కూడా రెమ్యునరేషన్ పెంచారట. ప్రస్తుతం ఆమె ఛార్జ్ చేస్తున్న మొత్తం రూ.3 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంటే ఇకపై సమంతను అందుకోవడం చిన్న నిర్మాతలకు కష్టమవుతుందేమో. ప్రస్తుతం ‘ఓ బేబీ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సమంత త్వరలోనే నాగ చైతన్యతో కలిసి ఇంకో సినిమా చేయనుంది.