సన్నీతో తెలుగు రీమేక్!

తెలుగులో దాదాపు పన్నెండు ఏళ్ల క్రితం వచ్చిన ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలో రీమేక్ చేయడానికి ఇప్పటివరకు సరైన హీరోయిన్ దొరకలేదని, ఇప్పుడు సన్నీలియోన్ ను చూసిన తరువాత రీమేక్ చేయాలనే ఆలోచన పుట్టిందని చెబుతున్నాడు దర్శకుడు శేఖర్ సూరి. సన్నీకు ప్రస్తుతం బాలీవుడ్ లో మాంచి క్రేజ్ వచ్చింది. ఆ పాపులారిటీను క్యాష్ చేసుకోవడానికి తెరపై ఆమెను అందంగా చూపించడానికి ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాను రీమేక్ చేయాల్సిందే అంటున్నాడు ఈ దర్శకుడు.
శేఖర్ సూరి డైరెక్ట్ చేసిన సినిమాల్లో ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ తప్ప మరే సినిమా హిట్ కాలేదు. తాజాగా ఈయన డైరెక్ట్ చేసిన ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు ముందడుగు వేస్తారా..? లేదా..? సందేహంగానే మిగిలిపోయింది. మరి ఈ రీమేక్ ముందుకు కదులుతుందో.. లేక ఆదిలోనే ఆగిపోతుందో.. చూడాలి!