Homeతెలుగు Newsప్రభాస్ వచ్చేలోపు సిద్ధార్థ్, అనసూయ దుకాణం సర్దేయాలి!

ప్రభాస్ వచ్చేలోపు సిద్ధార్థ్, అనసూయ దుకాణం సర్దేయాలి!

Siddharth and Anasuya have to fix the shop before Prabhas arrives

కంటెంట్ ముఖ్యం బిగిలూ అంటున్నాడు ఆడియన్. చిన్న చిత్రాలు నచ్చితే పెద్ద విజయాలు ఇస్తున్నాడు. జాతి రత్నాలు, బలగం చిత్రాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. జూన్ రెండో వారాల్లో వచ్చే సినిమాల్లో బలమైన కంటెంట్ ఉన్న ఆ తర్వాత వారానికి థియేటర్ల నుంచి పక్కకు తప్పుకోక తప్పదు.

రామాయణాన్ని బేస్ చేసుకుని బాహుబలి హీరోగా నటించిన భారీ సినిమా ఆదిపురుష్ రాకతో అందరూ దుకాణాలు సర్దేసుకోవాలని డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ మధ్యలో బలమైన డిస్కషన్ జరుగుతోంది.

రాముడిగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా ఆల్ ఇండియాలో భారీ రిలీజ్ అవుతుంది. తెలంగాణ, ఏపీలో కూడా మాగ్జిమమ్ స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకని ముందు వారం తెలుగులో మీడియం రేంజ్ స్ట్రైట్ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు.

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ టక్కర్ జూన్ 9న తెలుగు తమిళ్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాతో పాటు తమిళనాడు సముద్రఖని, మాస్టర్ ధృవన్, తెలుగులో స్టార్ యాంకర్ అనసూయ, రాహుల్ రామకృష్ణ మెయిన్ రోల్స్ చేసిన విమానం రిలీజ్ కూడా జూన్ 9నే. ఆదిపురుష్ భారీ విజయం సాధిస్తే ఈ రెండు సినిమాలు 16 తర్వాత థియేటర్లలో కనిపించవు. అలా కాకుండా సినిమా ఫ్లాప్ అయితే ఏజెంట్, కస్టడీ రిలీజ్ ల తర్వాత విరూపాక్షకు షేర్ పెరిగినట్లు ఈ రెండు సినిమాలకు ప్రేక్షకులు వస్తారు. అఫ్కోర్స్ అలా రావాలంటే ముందు ఈ రెండు హిట్ అవ్వాలి.

ఆదిపురుష్ రిజల్ట్ మీద నెక్స్ట్ వీక్ రిలీజ్ లు డిపెండ్ అవుతాయి. ప్రెసెంట్ మను చరిత్ర మాత్రమే జూన్ 23 రిలీజ్ కు రెడీ అయింది. ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయితే మన చరిత్ర తో పాటు మరో రెండు మూడు థియేటర్లలోకి వస్తాయి. లేదు అంటే జూలై 7న వచ్చే నిఖిల్ పై వరకు మరో పెద్ద సినిమా ఉండదు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!