HomeTelugu Trendingపెళ్లి తరువాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సునీత

పెళ్లి తరువాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సునీత

Singer sunitha posted a pho
టాలీవుడ్‌ సింగర్ సునీత ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో గత రెండు నెలలుగా ఈమె పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోతుంది. తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుని హాయిగా మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సునీత. నిశ్చితార్థం.. వెంటనే ప్రీ వెడ్డింగ్ పార్టీ.. ఆ తర్వాత మరో పార్టీ.. పెళ్లిలో హంగామా.. అలా చాలా వరకు ఈమె బిజీగానే ఉండిపోయింది. చాలా రోజుల తర్వాత సునీత మళ్లీ సోషల్ మీడియాలో తన పర్సనల్ ఫొటో పోస్ట్ చేసింది. సాయంకాల వేళ హాయిగా కూర్చుని కాఫీ తాగుతూ ఫోటోకు పోజిచ్చింది సునీత. చేతిలో కాఫీ కప్పు పట్టుకుని సేద తీరుతుంది. హ్యాపీ కాఫీ టైమ్ అంటూ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. దాంతో అభిమానులు కూడా ఈ ఫొటోను చూసి నైస్ పిక్.. మీరొక్కరే ఉన్నారు తోడు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు.

https://www.instagram.com/p/CKOY1Til-Fo/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!