HomeTelugu Newsహ్రితిక్ రోషన్ ను అభినందించిన రజినీకాంత్!

హ్రితిక్ రోషన్ ను అభినందించిన రజినీకాంత్!

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే యావత్ భారతదేశం లో క్రేజ్ ఉన్న వ్యక్తి. అటువంటి స్టార్ మన్ననలను పొందటం బాలీవుడ్ హీరో ల కు కూడా గర్వకారణం. ఇప్పుడు రజినీకాంత్ ప్రశంశలను అందుకోవటం బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ వంతు అయింది. 
 
హ్రితిక్ నటించిన “బలం” చిత్రం ట్రైలర్ ల ను, పాటలను చూసిన రజినీకాంత్, హ్రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో ఈ విషయాన్ని వెల్లడించారు.  హ్రితిక్ నటనను, ప్రతిభ ను ఆయన ప్రత్యేకం గా పొగిడారు. ఈ వార్త విన్న హ్రితిక్ రోషన్ ఎంతగానో ఆనందించి రజినీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. 
 
రజినీకాంత్, హ్రితిక్ తండ్రి రాకేష్ రోషన్ ల ది 30 సంవత్సరాల గా కొనసాగుతోన్న బంధం. హ్రితిక్ రోషన్ తాత గారు జె ఓం ప్రకాష్ తీసిన “భగవాన్ దాదా” చిత్రం తో వీరిద్దరి బంధం ఏర్పడింది. ఆశక్తి కర విషయం ఏమిటంటే, హ్రితిక్ రోషన్ కి మొట్ట మొదటి డైలాగ్ ఉన్న చిత్రం ఇదే కావటం. అప్పుడు హ్రితిక్ వయసు 12 సంవత్సరాలు. 
 
ప్రపంచ వ్యాప్తం గా జనవరి 25 న కాబిల్ విడుదల కాబోతోంది. ఇదే చిత్రం తెలుగు లో బలం గా వస్తోంది. హ్రితిక్ , యామి జంటగా నటించిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ను సంజయ్ గుప్తా డైరెక్ట్ చేయగా, రాకేష్ రోషన్ నిర్మించారు.  రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం లో హ్రితిక్, యామి ఇద్దరు అంధులు గా నటించటం విశేషం. 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!