HomeTelugu Trendingతలైవి కోసం కంగనా కష్టాలు

తలైవి కోసం కంగనా కష్టాలు

10 14సినీ తారగా, పార్టీ అధినేత్రిగా, ముఖ్యమంత్రిగా, ఐరన్ లేడీగా… జయలలిత చరిత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. ఆమె జీవితంలో రక్తికట్టించే మలుపులకు, అనూహ్య సంఘటనలకు లెక్కలేదు. అందుకే దర్శక నిర్మాతలకు ఇప్పుడామె పెద్ద అసెట్ అవుతున్నారు. మరెవరూ లేనట్లు పురచ్చితలైవి జీవితాన్నే కథాంశంగా ఎంచుకుని మూడు నాలుగు బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 140 పైగా సినిమాల్లో హీరోయిన్‌గా విభిన్న పాత్రలు పోషించారు జయలలిత. తాజాగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ‘తలైవి’ అనే పేరు ఖరారు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మణికర్ణిక’ వంటి హిస్టారికల్ మూవీ తర్వాత రనౌత్ నటిస్తోన్న బయోపిక్ ఇది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు ‘డర్టీ పిక్చర్’ కథా రచయిత రజత్ అరోరా కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో జయలలిత కనిపించేందకు కంగానా అమెరికాలోని లాస్ ఏంజెల్‌లో ప్రముఖ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్‌ని కలిసింది. అక్కడ తన స్టూడియో అతను కంగానకు ప్రొస్తెటిక్ మేకప్ చేసాడు. ఆ ఫోటోలను కంగనా తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు జయలలిత బయోపిక్ మరో మైండ్ బ్లోయింగ్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంటూ తన పోస్ట్‌లో రాసింది. అమ్మగా, పురుచ్చతలైవీగా అభిమానులతో పిలిపించుకున్న జయలలిత తమిళనాడు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను శాసించారు. ఈ సినిమా కోసం రూ.24 కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్టు సమాచారం. ఈసినిమాను తమిళం, హిందీతో పాటు కన్నడ, తెలుగు, మలయాళంలో విడుదల చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!