HomeTelugu TrendingPrabhas To Mahesh Babu: మన స్టార్స్‌ ఫేవరట్‌ సినిమాలు ఏమీటో తెలుసా?

Prabhas To Mahesh Babu: మన స్టార్స్‌ ఫేవరట్‌ సినిమాలు ఏమీటో తెలుసా?

Prabhas To Mahesh BabuPrabhas to Mahesh Babu: మన ఫేవరట్‌ హీరోహీరోయిన్‌ల గురించి ఏ చిన్న విషయమైన తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటాం.. అయితే మనం ఎంతో ఇష్టపడే స్టార్లను నచ్చిన సినిమాల గురించి బయటకు చెప్పేది చాలా అరుదు. మరీ మన స్టార్స్​ మెచ్చిన సినిమాలు ఏవో ఓ లుక్కేద్దామా.

మహేశ్‌ బాబు
‘అల్లూరి సీతారామరాజు’ మహేశ్‌ బాబు ఆల్‌టైమ్​ ఫేవరెట్‌ మూవీ. ఆయన త్రండి నటించిన సినిమా కావడం, అలాగే దాన్ని ఆ రోజుల్లోనే ఎంతో అద్భుతంగా చిత్రీకరించడమే అందుకు కారణం. ఆ మూవీని ఎన్నిసార్లు చూసినా ఆయనకు బోర్‌ కొట్టదట. చాలామంది ఆయనను ఆ పాత్రను చేయమని సూచిస్తుంటారు. కానీ మహేష్‌కు అది ఇష్టం లేదు. ఎందుకంటే తన నాన్నలా ఆయన ఆ పాత్రకు సరైన న్యాయం చేయలేనని నా నమ్మకం. ప్రయోగం చేసి ఓ మంచి సినిమాను చెడగొట్టడం కన్నా తీరిక దొరికినప్పుడల్లా దాన్ని చూడటం మంచిదని ఆయన అభిప్రాయం.

విజయ్‌ దేవరకొండ
ఆయన హాస్టల్‌ నుంచి వచ్చిన ‘గ్లాడియేటర్‌’, ‘పోకిరి’ సినిమాలు చూశాడు. ముఖ్యంగా ‘గ్లాడియేటర్‌’ సీడీని తెప్పించుకుని మరీ చూడంట. అయితే ఆ సినిమా, అందులోని పాత్రలు కూడా ఆయనకు పెద్దగా అర్థం కాలేదు కానీ దాన్ని తెరకెక్కించిన తీరు మాత్రం ఆయనకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత థియేటర్​లో ‘పోకిరి’ సినిమా చూడటం ఆయను ఇప్పటికీ గుర్తుంది. అందులో హీరో మహేశ్‌ బాబు పరుగెత్తుతూ ఎండుమిర్చి, కూరగాయల మధ్య ఎగురుతున్న సీన్​ ఎంత అద్భుతంగా ఉంటుందో. దాన్ని చూశాక హీరో అంటే ఇలాగే ఉండాలని విజయ్‌కు అనిపించిందట. అంతేనా, తాను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటువంటి సీన్​కు ఒక్క సారైనా రీక్రియేట్ చేయాలనేదే ఆయన కోరిక. అందుకే విజయ్‌ డైరెక్టర్లను అప్పుడప్పుడూ ఆ సీన్‌ను పెట్టే ఛాన్స్‌ ఉంటే చూడండి అంటూ ఇప్పటికీ అడుగుతుంటాడట.

త్రిష
త్రిష ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘వర్షం’. దాదాపు వంద రోజుల పాటు త్రిష వర్షంలో తడుస్తూనే ఉండి ఆ సినిమాను చేయాల్సి వచ్చింది. దీంతో ఆమెకు వర్షమన్నా, నీళ్లు అన్నా ఓ ఫోబియా ఏర్పడింది. కానీ త్రిష కష్టం వృథా పోలేదు. ఆ సినిమా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టడంతో పాటు తెలుగులోనూ మంచి ఆఫర్లను వచ్చేలా చేసింది. ఓ స్టార్‌ హీరోయిన్‌ను కూడా చేసింది. అందుకే త్రిషకు ‘వర్షం’ ఇప్పటికీ నచ్చుతుంది. ఫ్రీ టైమ్​లో ఆ సినిమాను చూడాలనీ అనిపిస్తుంది. ఇక ఆ ‘వర్షం’ తర్వాత ఆమెకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో ‘ది ఇంగ్లిష్‌ పేషెంట్‌’. ఆ మూవీని వంద సార్లకు పైగా చూసి ఉంటుందట.

కీర్తి సురేష్‌
ఆమె ఎక్కువసార్లు చూసిన సినిమాల్లో ‘టైటానిక్‌’ ఒకటి. అది ఓ అద్భుతమైన ప్రేమకావ్యం. అందులోని హీరో హీరోయిన్లు షిప్‌ అంచున నిల్చునే సీన్​ కీర్తి సురేష్‌ ఎన్ని సార్లు చూసినా.. కొత్తగానే అనిపిస్తుంది. ఆ సినిమాను చూసి కాస్త ఎమోషనల్‌ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట. అప్పట్లో ఓ సారి స్పెయిన్‌కు వెళ్లినప్పుడు, ఓ కార్​ ముందు ఆమె అదే సీన్​ను రీక్రియేట్ చేసిందట. ఎప్పటికైనా అటువంటి సినిమాలో నటించాలనదే కీర్తి కోరిక.

ప్రభాస్‌
ఆన్​స్క్రీన్​పై ప్రభాస్‌ ఎక్కువగా యాక్షన్‌ సినిమాలు చేసినప్పటికీ, ఆయనకు మాత్రం లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. అందుకే షూటింగ్‌లు లేని సమయంలో ప్రభాస్‌ లవ్‌ స్టోరీస్‌ను ఎక్కువగా చూస్తుడంట. కానీ అన్నిటి కంటే… మణిరత్నం తెరకెక్కించిన ‘గీతాంజలి’ సినిమా అంటే ప్రభాస్‌కు మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అందులోని ప్రకాశ్‌ – గీతాంజలి పాత్రలు, వాటిని రూపొందించిన తీరు వావ్‌ అనిపిస్తుంటుందట. ఇక ఆయన ఎక్కువసార్లు చూసిన సినిమా ‘షోలే’.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!