చిరుకి ఇద్దరు హీరోయిన్‌!

మెగాసార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ‘సైరా’ మూవీ పూర్తవగానే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా, శృతి హాసన్ పేర్లు వినబడినా ఇప్పుడు మాత్రం మరొక కొత్త వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇందులో ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో ఒకరు అనుష్క కాగా ఇంకొకరు ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ అని తెలుస్తోంది. మరి ఈ వార్త వాస్తవమో కాదో తెలియాలంటే మెగా కాంపౌండ్ స్పందించాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి.