
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్తంలో వచ్చిన చిత్రం ‘విడుతలై పార్ట్ 1’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈసినిమాని తెలుగు ‘విడుదల’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రత్యేక ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఈ మూవీ హీరో సూరి మరియు సమర్పకుడు అల్లు అరవింద్ కూడా ప్రదర్శనను వీక్షించారు.
స్థానిక మీడియాతో తన ఇంటరాక్షన్ సందర్భంగా, వెట్రి మారన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జూనియర్ ఎన్టీఆర్‌ని కలిశానని చెప్పాడు. ప్రాజెక్టు కచ్చితంగా జరుగుతుందని, అయితే సమయం పడుతుందని అన్నారు. అయితే వెట్రి మారన్ చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వెట్రి మారన్ యొక్క విడుదల చిత్రం ఏప్రిల్ 15, 2023న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్‌ను దర్శకుడు త్వరలో ప్రారంభించనున్నారు. ఈలోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను పూర్తి చేస్తాడు. కాగా ఇప్పటికే వెట్రి మారన్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పడు దర్శకుడే క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













