HomeTelugu Trendingవిజయ్‌ 65 సినిమా షూటింగ్‌ ప్రారంభం

విజయ్‌ 65 సినిమా షూటింగ్‌ ప్రారంభం

vijay thalapathy 65 movie sకోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ 65వ చిత్రం పూజా కార్యక్రమాలతో చెన్నయ్ లోని ఘనంగా మొదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత పూజా హెగ్డే ఈ మూవీతో మరోసారి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు ఉదయం సన్ టీవీ స్టూడియోస్ లో జరిగిన పూజా కార్యక్రమాలలో విజయ్ పాల్గొని క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన మూవీ యూనిట్.. మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసింది. ఈ కార్యక్రమంలో విజయ్ తళుక్కున మెరిశాడు. విజయ్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎంతో సింపుల్‌గా విజయ్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేపటి నుండీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. మనోజ్ పరమహంస ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది దీపావళికి లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానీ విడుదల చేసే ఆలోచనలో ఉన్నరట నిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!